యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడిగా : దొంతరవేణీ శ్రీనివాస్

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల కేంద్రానికి చెందిన దొంతరవేణీ శ్రీనివాస్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధక్షుడిగా నియామకమైయ్యారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన నూతన జిల్లా కార్యవర్గ సభావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ పోచబోయిన శ్రీహరి యాదవ్ అదివారం శ్రీనివాస్ యాదవ్ కు నియామకపత్రం అందజేసి శాలువాతో సన్మానించారు. యాదవ సంఘం మండలాధ్యక్షుడు మ్యాకల శ్రీకాంత్ యాదవ్,ఉపాధ్యక్షుడు రోడ్డ మల్లేశం యాదవ్,జిల్లా నాయకులు జెల్లా ప్రభాకర్ యాదవ్,సంఘ రవి యాదవ్,అమ్ముల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.