ఇంటింటికీ బీఆర్‌ఎస్‌

నవతెలంగాణ- ఉండవల్లి
భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అలంపూర్‌ నియోజకవర్గం నుంచి బీఫారం విజయానికి అందించారు. ప్రచార మాత్రం జోరుగా సాగుతూ. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంక్షేమ పథకాలు అభివద్ధి వంటి నీ ఆదర్శంగా తీసుకొని మూడోసారి ముఖ్యమంత్రిని చేసే బాధ్యత మన పైన ఉన్నదన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్‌ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని అభ్యర్థి విజయుడు కోరారు. ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. నియోజవర్గ అభివద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని వారు హామీ ఇచ్చారు బుధవారం నాడు జల్లాపురం మారమునగాల పల్లెపాడు గ్రామాల్లోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్‌ చైర్మన్‌ గజేంద్ర రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి పరమేష్‌ రెడ్డి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.