దుగ్యాల ప్రదీప్ కుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ- జూలపల్లి 

జూలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున పెద్దపల్లి నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మహిళా కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బిజెపి పార్టీకి ఓటు వేసి పెద్దపల్లి ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం 3100 మద్దతు ధరను కల్పిస్తుందని అన్నారు. ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాల ప్రభుత్వమని ప్రతి ఒక్క ఓటరు ఆలోచించాల్సిన సమయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జూలపల్లి ఇంచార్జ్ కొప్పుల మహేష్, సంతోష్ రెడ్డి,మల్లెతుల అంజి యాదవ్,ఓల్లే తిరుపతి,కళ్లెం రాజేశ్వర్ రెడ్డి,బొడిగె లక్ష్మణ్ బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.