నవతెలంగాణ-గణపురం
మండలంలోని గాంధీనగర్ మైలారం గ్రామాలలో టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం ఇం టింటి ప్రచారం నిర్వహించారు. మాజీ మహిళా సంఘం అధ్యక్షురాలు దౌడు సుమలత రమేష్ ఆధ్వర్యంలో ఇంటిం టి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి ప్రజలకు వివరించారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్య మంత్రిగా చూడాలని భూపాలపల్లి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్ర రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనరసింహారావు, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి ఎంపిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్, ఆర్‌ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కూతురు రమణ జిల్లా కోశాధికారి దౌడు రమేష్, నాయకులు బైరవని కుమారస్వామి రాజశేఖర్ రత్నం, రవి గాదె శేఖర్, ఉప సర్పంచ్ బోళ్ళ కష్ణ ముత్యాల సంపత్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.