నవతెలంగాణ-కొడంగల్
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామంలో గడపగడపకూ కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించిదని బాలంపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లా డుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో బూటకపు మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిం చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణలోని ప్రతి గడప గడపకు కాంగ్రెస్ ప్రభుత్వ 6 గ్యారెంటీలు చేరేంతవరకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఈ దోపిడి దొంగల ముఠాని తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టేంతవరకు నిద్రపోమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.