రెట్టింపు వినోదం

   సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నిర్మాతలు నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘డీజే టిల్లు’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు దీని సీక్వెల్‌ ‘టిల్లు స్క్వేర్‌’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే ఈసారి రెట్టింపు వినోదాన్ని పంచడానికి నటి అనుపమ పరమేశ్వరన్‌ తోడయ్యారు.ఈ సినిమాని సెప్టెంబర్‌ 15న విడుదల చేస్తున్నట్లు సోమవారం చిత్ర బృందం ప్రకటిస్తూ సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ల రొమాంటిక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈచిత్రానికి దర్శకత్వం: మల్లిక్‌ రామ్‌, డీఓపీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు, ఎడిటర్‌: నవీన్‌ నూలి, సంగీతం: రామ్‌ మిరియాల, శ్రీ చరణ్‌ పాకాల, ఆర్ట్‌: ఏఎస్‌ ప్రకాష్‌.