డబుల్స్‌ చాంప్‌ బోపన్న జోడీ

ఇండియన్‌వెల్స్‌ : 43 ఏండ్ల రోహన్‌ బోపన్న ఏటీపీ టోర్నీల చరిత్రలో ఓ రికార్డు సాధించాడు. ఏటీపీ మాస్టర్స్‌ 1000 టైటిల్‌ సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న జోడీ ఏటీపీ 1000 ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ చాంపియన్‌గా అవతరించింది. టైటిల్‌ పోరులో 6-3, 2-6, 10-8తో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎడ్బిన్‌ భాగస్వామిగా రోహన్‌ బోపన్న ఈ ఘనత సాధించాడు. నెదర్లాండ్స్‌, గ్రేట్‌ బ్రిటన్‌ జోడీ వెస్లీ, నీల్‌ జంట ఫైనల్లో టైబ్రేకర్‌లో పోరాడి ఓటమి పాలైంది. బోపన్న కెరీర్‌లో ఇది ఐదో మాస్టర్స్‌ టైటిల్‌ కావటం విశేషం.