– బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్
కోపెన్‌హాగెన్(డెన్మార్క్): బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి భారత పురుషుల, మహిళల డబుల్స్ జోడీలు ప్రవేశించాయి. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌లో సాత్త్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ జంట ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచారు. త్రీసా-గాయత్రి జంట 21-18, 21-10తో చైనీస్ తైపీకి జంటను, పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ 21-16, 21-9తో ఆస్ట్రేలియా జంటను చిత్తుచేశారు. ప్రి క్వార్టర్స్‌లో 2వ సీడ్ చిరాగ్-సాత్విక్ జంట మలేషియాకు చెందిన 6వ సీడ్ మార్టిన్-కర్నోండోతో, త్రీసా-గాయత్రి జంట టాప్‌సీడ్ చైనాకు చెందిన చెన్-యు-ఫిన్‌తో తలపడనున్నారు.