
సీజనల్ ఇతరత్రా వ్యాధుల గురించి సమీక్ష సమావేశం గురువారం మాధవ సాయి గార్డెన్లో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, హుజురాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారి అధ్యక్షతన మానకొండూరు నియోజకవర్గం లోని 6 మండలాల గ్రామపంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ ఈ సీజన్లో సీజనల్ వ్యాధుల గురించి గ్రామపంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజలు కూడా అంటువ్యాధులు సొఖకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి బసిరుద్దీన్, ఆరు మండలాల గ్రామపంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.