నవతెలంగాణ-హిమాయత్‌నగర్
మోసపూరిత మార్కెటింగ్ పద్ధతుల కేసులో క్యూ నెట్ సంస్థకు చెందిన ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు వేగంగా స్పందించి అరెస్ట్ చేయ డం పట్ల ఆమ్ ఆద్మీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు, క్యూ నెట్ బాధితుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. క్యూ నెట్ పేరుతో కాకుండా విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిరుద్యోగులను దోచుకుంటున్న వారిని సీసీఎస్ పోలీ సులు గుర్తించి విజయవంతంగా పట్టుకుని, విహన్‌కు చెందిన 35 బ్యాంకు ఖాతాల్లో రూ.54 కోట్లు స్తంభిం పజేయడం అభినందనీయమన్నారు. క్యూ నెట్ నిందితులు సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వీ-ఎంపైర్ పేరుతో బోగస్ కంపెనీని స్థాపించి, ఈ-కామర్స్ వ్యాపా రం పేరుతో రూ.50వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టిన వారికి నెలవారీ రాబడి రూ.20వేల నుంచి రూ.60వేల వరకు ఇస్తామని హామీ ఇస్తూ నిరు ద్యోగ యువత, అమాయక ప్రజల బాధితులను ప్రలోభ పెట్టి రూ.కోట్లు డబ్బులు వసూలు చేసి మోసం చేశారనీ, ఈ భారీ మోసంపై గత వారం క్యూ నెట్ బాధితుల జేఏసీ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసు కుని, బాధితుల సొమ్మును వాపసు ఇప్పించాలని కోరామ ని తెలిపారు. సీసీఎస్ ఆర్థిక నేరాల సెల్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని నిందితులను అరెస్ట్ చేయడం, బ్యాంకు ఖాతాలు స్తంభింప చేయడంపై వారికి దిడ్డి సుధా కర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే వీలైనంత త్వరగా బాధితుల డబ్బులను వాపసు ఇప్పించాల విజ్ఞప్తి చేశారు.