కోర్టు ఇంఛార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా డాక్టర్ పల్నాటి సమ్మయ్య

నవ తెలంగాణ-బోధన్ టౌన్
బోధన్ పట్టణంలోని ఐదవ జిల్లా సెషన్స్ కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా యం.శ్రీనివాస్ పదవి కాలం బుధవారం ముగియడంతో క్రొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమకం వరకు, అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బోధన్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ పల్నాటి సమ్మయ్యని ఇంఛార్జి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి ఉత్తర్వులు జారీ చేసిన్నట్టు నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మి నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.