రక్తహీనత నివారణకు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ సూచించారు. బుధవారం మండలంలోని తపాలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో కిశోర బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షను నిర్వహించారు. అలాగే అంగన్వాడీ చిన్నారులకు ఎత్తు, బరువు కొలిచారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. కిషోర్ బాలికలు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కమలాకర్ ఎం.ఎల్.హెచ్.పి సందీప్, అంగన్వాడీ టీచర్లు కవితా శ్రీవాణి, సునీత, ఏఎన్ఎం మాధవి ఆశ రజిత మమత తదితరులు పాల్గొన్నారు.