నవతెలంగాణ- పెద్దవంగర: యువత కోసమే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ అందిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డికుంట తండాకు చెందిన యువతకు తొర్రూరు లో నిర్వహించిన ఉచిత డ్రైవింగ్ మేళాలో లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను బొమ్మకల్లు ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్ తో కలిసి మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. గ్రామాల్లోని యువతీ యువకులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీటీసీ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో యోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. తండాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, అభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. యువత కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేకంగా ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బానోత్ సోమన్న నాయక్, శీను నాయక్, సుధాకర్ నాయక్, బానోత్ నవ్య నాయక్, రాజేందర్ నాయక్, బానోత్ రమేష్ నాయక్, శేఖర్ నాయక్, అనిల్ నాయక్, బానోత్ ప్రవీణ్ నాయక్, నరేష్ నాయక్, తరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.