– రూ.3.25 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 12 మంది అరెస్ట్
దాదర్: ముంబయి పోలీస్ డిపార్టుమెంట్‌లోని యాంటీ నార్కోటిక్ విభాగం అధికారులు రూ.3.25 కోట్ల విలువైన 16 కిలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు.12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.సహర్ గ్రామం నుంచి ఒకరు, నల్లసొపారా గ్రామం నుంచి ఇద్దరు, శాంటాక్రజ్ నుంచి ముగ్గురు, దక్షిణ ముంబై నుంచి ఇద్దరు, కుర్లా, బైకులా నుంచి ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నట్టు నార్కోటిక్ అధికారులు వెల్లడించారు. కుర్లా గ్రామంలో అరెస్టయిన నైజీరియా జాతీయుడి నుంచి రూ.2.24 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంధేరి నుంచి అరెస్టయిన మరో వ్యక్తి నుంచి 1.02 కోట్ల విలువైన గంజాయిను సీజ్ చేశార