నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గం కేంద్రంలో అండర్ పాస్‌ను ఇండ్లు కోల్పోతున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చొరవతోనే తగిన విధంగా న్యాయం జరిగిందని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం అన్నారు. పట్టణంలో రైల్వే గేట్ అండర్ పాస్ వద్ద తిరిగి ప్రారంభమైన నిర్మాణ పనులను ఆయన కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివద్ధ్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఆలేరు అభివద్ధిలో భాగంగా చేపట్టిన అండర్ పాస్ నిర్మాణ పనులు , నిర్మాణంలో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్ట పరిహారాన్ని ఎమ్మెల్యే సునీత ప్రత్యేక చొరవతో బాధితులకు న్యాయం చేశారన్నారు. అనివార్య కారణాల వల్ల అందని వారికి కూడా తొందరలో నష్టపరిహారం అందుతుందన్నారు . కొందరు వ్యక్తులు కావాలని ప్రభుత్వం పై, ఎమ్మెల్యేను విమర్శించి అనవసర రాద్ధాంతం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు.ఎవరెన్ని విమర్శలు చేసిన మరో వంద రోజుల్లో అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.