గృహలక్ష్మి పథకానికి గడవు పోడగించాలి

నవతెలంగాణ -మోపాల్

బిజెపి మండల అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో మండల ఇన్చార్జి తాసిల్దార్ మునీరుద్దీన్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదవారి ఇంటికి ఇచ్చే 3 లక్షల రూపాయలు సరిపోవని కనీసం స్లాబు కూడా కట్టుకోవడానికి వీలుండదని కనీసం దాన్ని ఐదు లక్షల పొడిగించుతూ అలాగే చాలామంది గ్రామీణ ప్రాంతాలలో వారికి సరైన అవగాహన లేక ఇంకా అప్లై చేయలేరని ఆ సమయాన్ని కూడా పొడిగించాలని రాజకీయాల కతీతంగా కేవలం నిరుపేదలకు మాత్రమే ఇవ్వాలని, ఆయన విజ్ఞప్తి చేశారు, కెసిఆర్ గారు కనీసం అల్లుడొస్తే పడుకోనికి జాగా ఉండదని చెప్పిన ఆయన 3 లక్షల రూపాయలతో కనీసం రేకుల షెడ్డు కూడా కట్టుకోవడం ఈ రోజుల్లో సాధ్యం కాదని అల్లుడచుడు దేవుడెరుగు కన్న కూతురు కూడా పడుకోనికి జాగా ఉండాలని ఇప్పటికైనా ఆలోచించి, గృహ నిర్మాణానికి ఇచ్చే రూపాయలని పెంచాలని ఆయన కోరాడు ఈ కార్యక్రమంలో అరికెల శ్రీకాంత్ రెడ్డి మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.