మూగజీవుల’గోస’

– పాడి రైతుకు ప్రోత్సాహమేదీ ?
– మూగ జీవులకు అందని వైద్యం
– పాడి రైతుకు పట్టించుకొని పాలకులు
ఆంబులెన్స్‌ వెటర్నరీ డాక్టర్‌ రాలేదు. ప్రభుత్వం, పాలకులు ఆర్థికంగా ఆదుకోవాలి. మొబైల్‌ వెటర్నరీ సర్వీసెస్‌ ప్రాజెక్ట్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌1962 కి ఉదయము ఏడు గంటలకు సమాచారం ఇవ్వగా స్పందిండం లేదని రైతు తెలిపారు. ఇప్పటికైనా .అత్యవసర పశువైద్య సేవలను అందించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.
నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేట నియోజకవర్గం అంకిరోనిపల్లి పల్లి గ్రామానికి చెందిన యువ పాడి రైతు మూడవత్‌ చందూలాల్‌ నాయక్‌ విద్యను అభ్యసించి ఉద్యోగాలు రాక నిరుద్యోగిగా ఉప్పునుంతల మండలం పరిధి శివారులో తన వ్యవసాయ పొలంలో పాడి పరిశ్రమ షెడ్డు నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని పాడి రైతుగా లక్షలలో అప్పులు పెట్టి బర్లను కొనుగోలు చేసి పాడి రైతుగా ఉపాధి పొందుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత నెలలో అక్టోబర్‌ 22న ఒక సంవత్సరం వయసులో ఉన్న బర్రెదూడ అవస్థతకు గురైనట్లు తెలిపారు. రైతు మొబైల్‌ వెటర్నరీ సర్వీసెస్‌ ప్రాజెక్ట్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌1962 కి ఉదయము ఏడు గంటలకు సమాచారం ఇవ్వగా స్పందించిన వెటర్నరీ సిబ్బంది 10 గంటలకు వస్తానని చెప్పినా డాక్టర్లు గంటల కొద్ది వేచి చూసిన జంతువుల అంబులెన్స్‌ రాకపోవడం పట్ల రైతు మరల డాక్టర్లను సంప్రదించగా ఫలితం దక్కలేదు. వెటర్నరీ డాక్టర్‌ పాడి రైతుకు పోన్లులో స్పందిస్తూ మేము రాలేకపోతున్నాం ప్రైవేట్‌ గా మందులు తెచ్చుకొని చూపించుకోమన్నారు. పాడి రైతు సమయం ఆలస్యమైన మీరే రావాలని డాక్టర్లను కోరారు. సాయంత్రం కావస్తున్న ఆంబులెన్స్‌ వెటర్నరీ డాక్టర్‌ రాలేని ఎడల బర్రె దూడ ఆరోగ్యం విషమించి రాత్రి 7 గంటలకు మతి వాత పడింది. దూడ విలువ 30 వేలుగా ఉంటుందని ప్రభుత్వం, పాలకులు ఆర్థికంగా ఆదుకోవాలని పాడి రైతు కోరారు. 1962 కి కాల్‌ చేసినప్పుడు సకాలంలో చికిత్స అందజేసి మరియు జంతువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, జంతువు ఉత్పాదకతను పెంచడం, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.అత్యవసర పశువైద్య సేవలను అందించడం సంక్లిష్టమైనది, ఎందుకంటే వివిధ జాతుల జంతు రోగులను నియంత్రించడం మరచి మూగజీవులకు అవస్థత పట్ల అధికారులు, పాలకులు బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒక వెహికల్‌ ఉండడం పట్ల సమస్యగా మారింది.
ఆరోజు కేసులు ఎక్కువగా ఉండే, నియోజకవర్గానికి ఒకటే వెటర్నరీ ఆంబులెన్స్‌ వెహికల్‌ ఉండటం వల్ల కొన్ని కేసులకు అందుతున్నాము కొన్ని కేసులుకు అందలేకపోయాం ఒక వెహికల్‌ ఉండడం పట్ల పెద్ద సమస్యగా సమస్యగా మారింది.
– పశువుల అంబులెన్స్‌, వెటర్నరీ డాక్టర్‌ హరీష్‌
బర్రె దూడకి రెండు రోజుల క్రితం సుస్తీ
1962 హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ కి ఉదయం 7 గంటలకు ఫోను చేశాను పది గంటలకు వస్తామని చెప్పి మధ్యాహ్నం ఒకటి కావస్తున్న రాలేదు, అంబులెన్స్‌ వెటర్నరీ డాక్టర్‌ నాకు ఫోన్‌ చేసి వెహికల్‌ రాదు ప్రైవేట్‌ గా మందులు తీసుకుని చూపించుకోండి అన్నారు. మీకు ఆలస్యమైన రావాలన్నా కానీ రాలేదు దూడ పరిస్థితి విషమించి చనిపోయింది. మీడియాకు ఇస్తా అని డాక్టర్‌ తో చెప్పగా వాళ్లే కట్టిస్తారు అని అన్నాడు. వాళ్లు సహకరించినందుకే దూడ చనిపోయింది. పాడి పరిశ్రమ పెంచుకోవాలనుకున్న వాళ్లు కూడా సహకరించాలని కోరుతున్నాం
– మూడవత్‌ చందులాల్‌ నాయక్‌, పాడి రైతు