నవతెలంగాణ – నసురుల్లాబాద్
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన సంపత్ అనే బ్యాంకు ఉద్యోగి మణిపూర్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నట్లు దుర్కి గ్రామస్తులు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన రాజు అనే కిరణ వ్యాపారికి ఒకే ఒక కొడుకు సంపత్ కు ఉద్యోగం రావడంతో గత సంవత్సరమే పెళ్లి చేశారు. ఉద్యోగరీత్యా మణిపూర్ కు బదిలీపై వెళ్ళాడు, కుటుంబ తగాదా వల్లే బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలిపారు ఈ సంఘటనతో వారి కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శవం కోసం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపారు.