డీయూ ప్రతిపాదన వివాదాస్పదం

– అంబేద్కర్‌ ఫిలాసఫీపై యూజీ కోర్సు తొలగింపునకు సిఫారసు
– సంబంధిత విభాగం, విద్యావేత్తల నుంచి విమర్శలు
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ ఫిలాసఫీపై అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) కోర్సును తొలగించాలన్న ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రతిపాదన వివాదాస్పదమవుతున్నది. డీయూ స్టాండింగ్‌ కమిటీ చేసిన ఈ ప్రతిపాదనపై యూనివర్సిటీ ఫిలాసఫి డిపార్ట్‌మెంట్‌ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోర్సును అలాగే ఉంచాలని సదరు విభాగం డీయూ వైస్‌ ఛాన్సలర్‌ను కోరింది. ఈ విషయంలో ఇటు దేశంలోని విద్యావేత్తలు, నిపుణుల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అంబేద్కర్‌ మహనీయుడి డీయూ ప్రతిపాదన వివాదాస్పదం తత్వశాస్త్రంపై యూజీ కోర్సును తొలగించకూడదనీ, దానిని భావి తరాలకు అందేలా చూడాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉన్నదని తెలిపారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయాన్ని మాత్రం ఇంకా తీసుకోలేదని స్టాండింగ్‌ కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు. అకడమిక్‌ కౌన్సిల్‌కే ఆ నిర్ణయాన్ని తీసుకునే అధికారం ఉంటుందని చెప్పారు.