సాహితీ వ్యాసంగం అధ్యాపనలో ద్వానా శాస్త్రి అసమానుడు

నవతెలంగాణ-కల్చరల్‌
ఒక ప్రక్క సాహిత్యం లో కవిత, కధ, వ్యాసం, విమర్శ పలు ప్రక్రియల్లో వ్యాసంగం సాగించిన ద్వానా శాస్త్రి సివిల్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు శిక్షణా కేంద్రాలలో బోధన చేయటం లోనూ అసమాన ప్రతిభావం తుడని పోలీస్‌ హౌసీంగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ అన్నారు శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా ద్వానా శాస్త్రి జయంతి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా దామోదర్‌ పాల్గొని మాట్లాడుతూ ద్వా నా శాస్త్రి గా ప్రఖ్యాతి పొందిన ద్వాదశి నాగేశ్వర శాస్త్రి పలు గ్రంథ కర్త అన్నారు. చరిత్ర లో మరుగు అవుతున్న తెలంగాణ ప్రసిద్దుల గురించిన జీవిత కధలను గ్రంధ రూపం లో అందించి పరిశోధక విద్యా ర్థులకు ద్వానా శాస్త్రి సహకారం అందించారని గుర్తు చేశారు. ఆయన బోధన తో ఎందరో గ్రూప్‌ పరీక్షలలో సివిల్స్‌ లో విజయం సాధిం చారని తెలిపారు. సూరి భగవంతం ట్రస్ట్‌ చైర్మెన్‌ ఏస్‌. బి.రాం మాట్లాడుతూ ద్వానా శాస్త్రి స్నేహశీలి ఉన్నత విద్యా వంతుడు ఆయన అకాల మరణం బాధ కలిగించిదన్నారు. సాహితీ కిరణం సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు మాట్లాడుతూ గాన సభలో సాహితీ కార్యక్ర మాల్లో ఆయన ప్రముఖం గా పాల్గొనే వారని గుర్తు చేశారు. గాన సభ అధ్యక్షుడు కళా జనార్ధన మూర్తి అధ్యక్షత వహించిన సభలో గాయకుడు రామ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు