26 నుంచి డీవైఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సమావేశాలు

– హైదరాబాద్‌లోని ఎస్వీకేలో 28 వరకు నిర్వహణ 
– పోస్టర్‌ను ఆవిష్కరించిన నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) కేంద్ర కమిటీ సమావేశాలు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడురోజులపాటు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే)లో జరగనున్నాయి. ఈ సమావేశాలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంబంధిత వాల్‌ పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26న విద్య, ఉపాధి, పర్యావరణం అంశాలపై సెమినార్‌ను నిర్వహిస్తున్నా మని చెప్పారు. ఈ సెమినార్‌కు డీవైఎఫ్‌ఐ అఖిల భారత కార్యదర్శి హిమాగరాజ్‌ భట్టాచార్య, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరవుతారని వివరించారు. ఈనెల 27,28 తేదీల్లో డీవైఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సమావే శాలు జరుగుతాయని అన్నారు. ఈ సమా వేశాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువజన సంఘం నాయకులు హాజరవుతారని చెప్పారు. యువత ఎదు ర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యా చరణను రూపొందిస్తామని వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రయివేటు వ్యక్తులకు కట్ట బెడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధా నాలు యువతను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆం దోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి అవ కాశాలను కల్పించకుండా దేశ యువతలో మతోన్మాద విషబీజాలు నాటుతూ విద్వేషాలను రెచ్చగొడుతు న్నదని అన్నారు. అందరికీ విద్య, ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎండీ జావేద్‌, నాయకులు శివ, రఘు, శ్రీమాన్‌, రాజు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.