ఈ పండ్లు తినండి

ఈ వేసవిలో డీహైడ్రేషన్‌ బారిన పడకూడదన్నా… ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని పండ్లను తప్పక తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. అవేంటి? వాటితో ప్రయోజనాలేమున్నాయో తెలుసుకుందామా!
– పండ్లరాజుగా పిలిచే మామిడి పండుని మెచ్చనివారెవరు? 82 శాతం నీటిని కలిగిన ఈ పండ్లు ఆకలిని పుట్టిస్తాయి. జీర్ణ ప్రక్రియను సాఫీగా జరిగేలా చేస్తాయి. ఇందులోని విటమిన్‌ ఎ, సిలు కంటిచూపుని మెరుగుపరుస్తాయి. ఈ పండుని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉంటాయి.
– ఈ పండులోని పోషకాలు గుండె పనితీరుని సరిచేస్తాయి. శరీరంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. నారింజలో ఉండే 85శాతం నీరు… నిస్సత్తువ రాకుండా చూస్తుంది.
– మెగ్నీషియం, పొటాషియంలు మెండుగా ఉండే ఈ పండుని తినడం వల్ల రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంటాయి. వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ పండుకి ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగానూ ఉంటుంది.
– తొంభైశాతం నీటితో నిండి ఉండే పుచ్చకాయని ఈ కాలంలో తప్పక తినాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు కలిగి ఉన్న ఈ పండు… ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా చూస్తుంది. చెమట కారణంగా కోల్పోయిన విటమిన్లూ, ఖనిజాలనుభర్తీ చేస్తుంది. రకమేదైనా ఈ పండుని పచ్చిగా తీసుకున్నా, సలాడ్లలో కలుపుకొన్నా మంచిదే. పొటాషియం, విటమిన్‌ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా దొరుకుతాయి. ఎండబారిన పడకుండా కాపాడతాయి.