వ్యాపార అభివృద్ధితో ఆర్థికంగా ఎదగాలి

– గొల్లపల్లి రాజేందర్ కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
లక్ష్మి 1 గ్రామ్ గోల్డ్ షాప్ వ్యాపార అభివృద్ధితో ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలో 163 వ జాతీయ రహదారి వెంట లక్ష్మి 1 గ్రామ్ గోల్డ్ నూతన షాపును రాజేందర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ యువత ఉద్యోగం వైపు చూడకుండా వ్యాపార రంగలో అభివృద్ధి చెందే దిశగా ప్రయత్నాలను చేసి సఫలం కావాలని అన్నారు. అత్యధిక డిజైన్లతో మహిళలను అత్యంత ప్రీతిపాత్రంగా ఆకర్షించే విధంగా షాపు దినదినం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నూనేటి శ్యామ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, పాలడుగు వెంకటకృష్ణ, పెండెం శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.