ఈడీ కేసు కొట్టివేత

నవతెలంగాణ -హైదరాబాద్‌
ఎంపీ స్టేట్‌లోని ఈ టెండర్లలో అక్రమాల అభియోగాలతో రిటెర్డు ఐఏఎస్‌ ఎం.గోపాల్‌రెడ్డిపై ఈడీ పెట్టిన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై ప్రధాన కేసును, ప్రధాన నిందితుడు శ్రీనివాస రా జులపై గతంలోనే హైకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంతో తనపై ఈడీ పెట్టిన కేసును కొట్టేయాలని గోపాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో జస్టిస్‌ సురేం దర్‌ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ కేసును కొట్టేస్తూ తీర్పు చెప్పారు.