అనిల్‌ అంబానీని విచారించిన ఈడీ

ముంబయి : రిలయన్స్‌ ఎడిఎ గ్రూప్‌ అధినేత అనిల్‌ అంబానీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు ప్రశ్నించారు. విదేశీ మారక చట్టం (ఫెమా) నిబంధనలు ఉల్లంఘన కేసులో సోమవారం అనిల్‌ విచారణకు హాజరయ్యారు. ముంబయిలోని ఇడి కార్యాలయంలో అధికారులు అనిల్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. కాగా.. ఏ కేసులో ఆయనను విచారించారనే విషయం బయటికి రాలేదు.