మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. బుధవారం గోల్నాక డివిజన్‌ పరిధిలోని కాంఘర్‌ నగర్‌ స్థానిక అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.20 లక్షల నిధులతో త్వరలో కాంఘర్‌ నగర్‌లో నూతన డ్రయినేజీ పైప్‌ లైన్‌ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సంజీవయ్యనగర్‌ సమస్యల పరిష్కారానికి కృషి
సంజీవయ్య నగర్‌ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. నల్లకుంట డివిజన్‌లోని సంజీవయ్య నగర్‌లో పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ ప్రాంతంలో తాగు నీరు తగినంతగా రాకపోవడం, నీటి సరఫరాలో లో ప్రెషర్‌ సమస్య, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్‌ వైర్లు పాడవడం సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాగా వెంటనే సానుకూలంగా స్పందించి అక్కడే ఉన్న అధికారులకు వెెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంజీవయ్య నగర్‌ లో సీసీ రోడ్డు కూడా వేయిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టిందని అంబర్‌ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. బుధవారం హిమాయత్‌ నగర్‌ ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మెల్యే కాచిగూడ కార్పొరేటర్‌ కన్నె ఉమా రమేష్‌ యాదవ్‌తో కలిసి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ 33 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంల బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు ఎర్ర భీష్మ దేవ్‌, మన్నె శ్రీనివాస్‌ యాదవ్‌, భీమ్‌ రాజు, మధు యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.