– విజయవంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్ IX
– పిల్లల అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతాం
– వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటి రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
జిల్లా పరిధిలో తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లితండ్రుల వద్దకు చేర్పించడం, అనాథలకు పునరావాసం కల్పించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-×శ జిల్లాలో విజయవంతగా కొనసాగుతుందని ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వి వరాలను శుక్రవారం వెల్లడించారు. తప్పిపోయిన చిన్నా రుల వివరాలను సేకరించి వారి ఫోటోలు కలిగిన ఆల్బమ్ ను రూపొందిస్తారని తెలిపారు. ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు జిల్లా పరిధిలో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లను, జనసామ ర్థ్యం కలిగిన జంక్షన్లు, చౌరస్తాలు, నిర్మా ణ స్థలాలు, హౌటళ్లు, బ్రిడ్జిలు, తనిఖీ చేస్తారని తెలిపారు. వెట్టి చాకిరిలో ఉన్న బాలబాలికల విముక్తి కోసం కూడా ఈ ప్రత్యేక టీమ్‌లు పని చేస్తాయని తెలిపా రు. ఆపరేషన్ ముస్కాన్‌లో ఇప్పటి వరకు 19 మంది పిల్లలను కాపాడినట్టు వివరించారు. అందులో 15 మంది బాలలు 4 గురు బాలికలు ఉన్నారని, వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. సరైన చిరు నామా దొరకని పిల్లలను షెల్టర్ హౌంలలో ఉంచుతామని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తామ న్నారు. పిల్లల అక్రమ రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తమ పరిసరాల్లో, పని ప్రదే శాల్లో బాల కార్మికులు గానీ, పిల్లల అక్రమ రవాణా గురిం చిన సమాచారం తెలిస్తే తక్షణమే డయల్ 100కు సమా చారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇది వరకే నేరస్తులు, తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసు కునేందుకు ఉపయోగపడే దర్పన్ మొబైల్ అప్లికేషన్ గురించి సిబ్బందికి శిక్షణ ఇచ్చామని ఎస్పీ తెలిపారు.