ఆర్టీసీలో జేఏసీ ఏర్పాటుకు ప్రయత్నాలు

– భేటీ అయిన ఆరు సంఘాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్‌ఆర్టీసీలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేయాలని ఆరు సంఘాలు అభప్రాయపడ్డాయి. సోమవారం రాత్రి నాడిక్కడి బీఎమ్‌ఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ఈ అశ్వత్థామరెడ్డి (టీఎమ్‌యూ), కే హన్మంతు ముదిరాజ్‌ (టీజేఎమ్‌యూ), ఎర్ర స్వామి కుమార్‌ (కార్మికసంఫ్‌), జీ అబ్రహం (ఐఎన్‌టీయూసీ), సుద్దాల సురేష్‌ (బీడబ్ల్యూయూ), డీ సాయిలు (ఎస్‌డబ్ల్యూయూ)తో పాటు ఎన్‌ఎమ్‌యూ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్మిక పరిషత్‌, ఎస్‌టీఎమ్‌యూ కూడా జేఏసీ ఏర్పాటుకు అంగీకారం తెలిపాయని నాయకులు చెప్పారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, బీకేయూ సంఘాలు సమావేశానికి హాజరు కాలేదనీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడుకోవలసిన అవసరం ఉన్నందున వారు కూడా సహదయంతో విశాల దక్పథంతో కలిసిరావాలని నాయకులు కోరారు. ఐక్యంగా ఉద్యమించి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు. జేఏసీగా ఏర్పడాలని ఈ సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. ఈనెల 19న మరోసారి అన్ని సంఘాలతో భేటీ కావాలని నిర్ణయించామన్నారు.