వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా

-విలేకరుల సమావేశంలో నవరంగ్
-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీనియర్ జర్నలిస్ట్ వాగుమారే గంగాధర్

నవతెలంగాణ- మద్నూర్: ప్రస్తుతం జరుగుతున్న జుక్కల్ అసెంబ్లీ ఎన్నికల్లో జుక్కల్ ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపిస్తే వెనుకబడ్డ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాగ్మారే గంగాధర్ తెలిపారు జుక్కల్ ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ నుండి ఆయన నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంగళవారం నాడు మద్నూర్ మండల కేంద్రంలోని నామినేషన్ కార్యాలయంలో తమ నామినేషన్ వేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎన్నో పార్టీలు ఎంతోమంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టిన ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని. ఈ ప్రాంతంలో అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని అలాంటి వారికి ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడం ఈ ప్రాంతం అన్ని రకాల పూర్తి వెనుకబడి ఉందని అలాంటి సమస్యలు తీర్చేందుకే సీనియర్ జర్నలిస్టుగా తనకు జుక్కల్ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలనీ ఆయన ప్రజలను కోరారు మద్నూర్ ప్రాంతంలో పత్తి పరిశ్రమలు అనేకంగా ఉన్నప్పటికీ ఇక్కడ టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈ ప్రాంత ప్రజలు పప్పు దినుసులు పండిస్తారని పప్పు దినుసుల పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయారని ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం ఈ ప్రాంత అభివృద్ధి జరగడం లేదని అభివృద్ధి చెందాలంటే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు నామినేషన్ పత్రం అందజేత కార్యక్రమంలో ఆ పార్టీ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు