నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఏజాస్ అహ్మద నియామకమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దుద్దిళ్ళ శ్రీనుబాబు ఆదేశాల మేరకు మహాదేవపూర్ గ్రామానికి చెందిన ఎజాస్ అహ్మద్‌ను మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బుధవారం నియమించారు. అనంతరం ఎజాస్ మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీ గెలుపు కోసం, శ్రీధర్ బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కషి చేస్తానని అన్నారు. మైనార్టీ సెల్ అధ్యక్షునిగా నియమించిన ఏఐసీసీ సెక్రెటరీ, మాజీ మంత్రి,మంథని శాసనసభ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, శ్రీను బాబు మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఫజల్ అహ్మద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, సీనియర్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, మహిళ కాంగ్రెస్ నాయకురాల్లకి, మైనార్టీ సెల్ నాయకులకి, ఎన్‌ఎస్‌యుఐనాయకులు, తదితరులకు ధన్యవాదాలుతెలిపారు.