నవతెలంగాణ-బోధన్ టౌన్ : బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రావణమాసం నుండి ఇప్పటి వరకు భక్తులు హుండీలో వేసిన కానుకలను దేవాదాయ ధర్మ దాయశాఖ ఇన్స్పెక్టర్ కమల, ఇఓ రవీందర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ రాములు, ఆలయ చైర్మన్ బీర్కుర్ శంకర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. 2 లక్షల 18, 154 నగదు వచ్చిందని దీనిని ఈవో ఆధ్వర్యంలో బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరుగుతుందని తెలిపారు.