నవతెలంగాణ- మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో ఒకటో వ వార్డులో గురువారం ఇంటింట ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గడ్డం ఎల్ల స్వామి ని ఓటేసి గెలిపించామని మునుగోడు నియోజవర్గ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. బీఆర్‌ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను గడపగడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ప్రజలు ఆశీర్వదిస్తే మూడు సంవత్సరాలకే బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి కావాలనా.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం 560 కోట్లతో అభివృద్ధి చేసిన కూసుకుంట్ల కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈనెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బండ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, మండల సీనియర్ నాయకులు పాల్వాయి జూనియర్ గోవర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రావిరాల కుమారస్వామి, పందుల శ్రీను, పాలకూరి నరసింహ గౌడ్, దుబ్బ రవి, పందుల లింగస్వామి, దుబ్బ రాజు తదితరులు ఉన్నారు.