గ్రామాల్లో ఎన్నికల ప్రచార జోరు

నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని మద్దికుంట, రెడ్డిపేట్, రామారెడ్డి, ఉప్పల్వాయి, పోసానిపేట్, తోపాటు ఆయా గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ తో పాటు బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ, ఆయా పార్టీలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆయా పార్టీల మేనిఫెస్టోను వివరిస్తూ తమ పార్టీకి ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.