– కార్పొరేటర్ స్వంత నిధులతో మసీద్ ప్రహారి నిర్మాణం
– ఓటర్లను ప్రలోభపెట్టడం కోసమే స్వయంగా పర్యవేక్షణ
– చోద్యం చూస్తున్న ఎన్నికల పరిశీలకులు
నవతెలంగాణ-హసన్‌పర్తి
గ్రేటర్ 55వ డివిజన్ పరిధి భీమారంలో స్వయంగా కార్పోరేటరే ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.2 లక్షల స్వంత నిధులతో మసీదు నిర్మాణ పనులను ప్రారంభించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఎన్నికల అధికారులు మాత్రం అవేమి పట్టిం చుకోకుండా చోద్యం చూస్తున్నారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నారు. సామాన్యుడు రూ.50 వేలకు మించి ఎటువంటి లావాదేవీలు నిర్వహించినా ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ హడావిడి చేస్తూ భ యాబ్రాంతులకు గురిచేస్తున్నారే తప్పా అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ జక్కుల రజితవెంకటేశ్వర్లు మాత్రం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఎన్నికల అధికారులకు కనపడకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆరో పిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న ఉన్నతాధికారులు, స్ట్రైకింగ్ పోర్స్, రూట్ ఆపీసర్, టాస్క్‌ఫోర్స్, పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదనడానికి నిన్న భీమారంలో ముస్లీం ఓట ర్లను ప్రలోభపెట్టేందుకు కార్పోరేటర్ జక్కుల రజితవెంకటేశ్వర్లు స్వయంగా రంగంలోకి దిగి రూ.2 లక్షల నిధులతో భీమారంలో మసీదు ప్రహరిగోడ ని ర్మాణ పనులు చేపట్టడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన సం బంధిత ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఏ పార్టీ నాయకుడికైనా ఒకే విధమైన చట్టం అమలు చేసి కఠి న చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల నిర్వహణ అధికారులు ఏవిధగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.