స్వర్ణకార సంఘం నూతన కమిటీ ఎన్నిక

Gold Smithహైదరాబాద్‌ : ఇటీవల ఏర్పడిన మేడిపల్లి మండలం విశ్వకర్మ స్వర్ణకార సంగం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా సుదర్శన చారి, వైస్‌ ప్రెసిడెంట్‌గా వలబోజు సోమనరసింహచారి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వలబోజు సత్యనారాయణ చారీ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా వినోద్‌ చారి, కోశాధికారిగా రవిందరా చారి, గౌరవ అధ్యక్షులుగా కుమార్‌ చారి, ప్రభాకర చారి, సలహాదారునిగా కొండపర్తి నరసింహ చారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్వర్ణకారులందరినీ కలుపుకుపోతామనీ, వారి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.