
సింగరేణి ఆర్జీ-3 ఏరియాలోని ఓసిపి-1,2 నూతన ఫిట్ ఎన్నిక జరిగింది. ఈ కార్యక్రమం ఏఐటీయుసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు రాజ్ కుమార్, వైవి రావు, సెక్రటరీ జూపాక రామచందర్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఓసిపి-1 ఫిట్ సెక్రటరీగా డిటి రావు, అసిస్టెంట్ సెక్రటరీలుగా మల్లేష్, ఓదెలు, వర్క్ షాప్ సెక్రటరీగా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. అదేవిధంగా ఓసిపి-2 ఫిట్ సెక్రెటరీగా ఎమ్మార్సీ రెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీలుగా సంపత్, శ్రీనివాసులు, వర్క్ షాప్ సెక్రటరీగా ఎ పోషంను, అసిస్టెంట్ సెక్రటరీగా బి పోషంను ఆర్గనైజింగ్ సెక్రటరీగా వెంకటస్వామిని ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ, మాపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు ఓసిపి-1,2 డెలిగేట్స్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అదేవిధంగా కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ యూనియన్ బలోపేతానికి కృషి చేస్తామని వారన్నారు.