మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

– జిల్లా ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండగంగాధర్, అధ్యక్షురాలు చామంతి లక్ష్మి  ఏకగ్రీవ ఎన్నిక,
నవతెలంగాణ – కంటేశ్వర్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా విస్తృత సమావేశం బుధవారం నాందేవ్ వాడలోని సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. కమిటీకి సంబంధించింది గురువారం వెల్లడించారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్యాద గోవర్ధన్ తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొండగంగాధర్, అధ్యక్షురాలుగా చామంతి లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా మల్యాల గోవర్ధన్ లతోపాటు మరో ఆరుగురు ఆఫీస్ బేరర్ లను ఎన్నుకున్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కార్మికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు, సంఘాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులపై మధ్యాహ్న భోజన కార్మికులు అప్రమత్తంగా ఉండి సిఐటియు సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు, మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం కాదని, కనీస వేతనం 21 వేల రూపాయలు అందించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్లాబ్ రేట్లు పెంచాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, కార్మికులందరికీ ఒకే యూనిఫామ్ ఇవ్వాలని, ఇప్పటికే పెండింగ్లో ఉన్న బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, సమస్యల సాధన కోపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.