ఎన్నికల సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పీ.ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్‌
ఎన్నికల సిబ్బంది నిరంతరం అప్ర మత్తంగా ఉండాలని వరంగల్‌ జిల్లా కలె క్టర్‌ ప్రావీణ్య అన్నారు.రాష్ట్ర శాసన సభ ఎన్నికలను నేపథ్యంలో కలెక్టరేట్‌ ఏర్పా టు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రావీ ణ్య మంగళవారం ఆకస్మికంగా సందర్శిం చారు. 24గంటలు పని చేసే ఫిర్యాదుల కేంద్రం, విజిల్‌, కంట్రోల్‌ రూం, 1950 ,సోషల్‌ మీడియాఫిర్యాదుల నమోదును పరిశీలించి మరింత సమర్ధంగా నిర్వ హించుటకు అధికారులు, సిబ్బందికి ప లు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కంట్రోల్‌ రూమ్‌లో నిర్వహిస్తున్న రికార్డు లను పరిశీలించి ఎన్నికల సిబ్బంది నిరం తరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫి ర్యాదులపై తక్షణమే స్పందించాలనీ ఆదే శించారు. సి-విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్ప టి వరకు 38కేసులు నమోదు కాగా అ న్ని పరిష్కారించామన్నారు. ఓటర్‌ వివ రాలు, ఎన్నికలకు సంబంధిత వివరాల కోసం 1950 టోల్‌ ఫ్రీ నంబర్కు 237 కాల్‌రాగా వాటిని పరిష్కరించా మని క లెక్టర్‌ తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్ర లోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, మీడియాలో ఫేక్‌ న్యూస్‌ ప్రసారమైన వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. యువత సి-విజిల్‌ యాప్‌ ను ఉప యోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లం ఘన లను తమ దష్టికి తీసుకుని రావాలని, 24గంటలు కలెక్టరేట్‌ కార్యాల యంలోని సమీకత జిల్లా ఫిర్యాదుల పర్య వేక్షణ కేంద్రం నుండి సి-విజిల్‌ యాప్‌ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరు గుతుందని అన్నారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిణ, ఇతర ఎన్నికల ఉల్లం ఘనలపై లైవ్‌ ఫోటోలు, వీడియోలు సి – విజిల్‌ యాప్‌ ద్వారా పంపాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ వాసు చంద్ర, డిపిఆర్‌ఓ ఆయూబ్‌ అలీ, ఏవో శ్రీకాంత్‌ , డిఐఓ అప్పిరెడ్డి, ఇతర విభాగా ల తదితరులు పాల్గొన్నారు.