– దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యం
– మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కాదని చెప్పారు. ఒకవేళ కేంద్రంతో పాటు, బీజేపీ అధికారం లో ఉన్న 15 రాష్ట్రాల్లో ముందస్తుకు పోయినా… దాదాపు 19 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయ న్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడి యాతో మాట్లాడారు. తాను జైలుకు వెళ్ళడానికి టీడీపీ, కాంగ్రెస్ లే కార ణంగానే జగన్ అని భావించారన్నా రు. అందుకే చంద్రబాబును జైలుకు పంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నా రు. అయితే చంద్రబాబు ను జైలుకు పంపడం నెత్తి మీద పాలు పోసిన ట్లైందన్నారు. చంద్రబాబు పై పెట్టిన కేసు నిలవదని, రానున్న ఎన్నికల్లో టీడీపీ 151 స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు.