ఎలక్షన్స్ అప్పుడు వస్తారు… అయ్యాక మయం అవుతారు…

– అయ్యాక మయం అవుతారు..

– మా అభివృద్ధిని ఎదుర్కోలేక అనవసర ఆరోపణలు
– వక్ఫ్ భూముల పేరుతో ప్రతి ఎన్నికల్లో నాపై ఆరోపణలు
– వందల సార్లు చెప్పిన.. దేవుని సొమ్ము తింటే పాపం తప్పదు..
– నన్ను తిడితే టిక్కెట్ వస్తదని ఆశలో  ప్రతిపక్షాలు.. 
– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్..
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ నియోజకవర్గం లో ఎన్నికల సమయానికి కొందరు ఆర్నెల్ల ముందు వస్తారు. మళ్ళీ ఎన్నికలు అయ్యాక మయం అవుతారు. వాళ్ళను నమ్మితే నట్టెట్ట ముంచుతారు. మేము కట్టిన కేబుల్ బ్రిడ్జి తీగలను అమ్ముకునే బాపది వాళ్లంతా అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.. రాష్ట్ర ఏర్పాటు తరువాత 60 యేండ్లలో చేయని అభివృద్ధినీ మేము తొమ్మిది యేండ్లలో చేసి చూపమని అన్నారు. కరీంనగర్ కు వేల కోట్ల నిధులు తీసుకొచ్చి అద్భుతమైన అభివృద్ధి చేశానన్నారు. తాను చేసిన అభివృద్ధిపై మాట్లాడలేక తనపై వ్యక్తిగత ఆరోపణలకు ప్రతిపక్షాలు దిగుతున్నాయని విమర్శించారు. ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు నాపై ఒక్కసారి బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు తాను ఈ విషయంలో వందలసార్లు అనేక వేదికల్లో వారి ఆరోపణలు ఖండించాననీ తెలిపారు. ప్రతిపక్షాలు చెబుతున్న ప్రాంతంలో కనీసం ఒక్క మైనారిటీ ఇల్లు గానీ,  దర్గా కానీ లేదని  అన్నారు. ఇప్పటికే తనపై ఆరోపణలు చేసిన వారిపై కేసు పెట్టామని, కోర్టు నోటీసులు కూడా పంపామని తెలిపారు. ఓటుకు ఎంత వస్తె అంత మాట్లాడితే పరువు నష్టం, జైలు తప్పదని అన్నారు. అందుకు ఇటీవల చిరంజీవి పై మాట్లాడిన జీవిత రాజశేఖర్ పరిస్తితి వారికి వస్తుంది అన్నారు. నన్ను తిడితే టిక్కెట్ వస్తుంది అని కొందరు ప్రతిపక్షాల నాయకులు భావిస్తున్నారని, అది వాళ్ళ పిచ్చి తనమని అన్నారు. వాళ్ళు గతం లో అధికారం లో ఉన్నపుడు లక్ష రూపాయల రోడ్ పని జరిగితే అందులో 60 వేలు మింగి 30 వేల పనులు చేసేవారని ఎద్దేవా చేశారు. నాణ్యత తో కూడిన కేబుల్ బ్రిడ్జి లాంటి అత్యధ్బుత అభివృద్ధి చేశాం అన్నారు. ఒకవేళ వలె గనుక అధికారంలోకి వస్తే కేబుల్ బ్రిడ్జి తీగలు అనుకుంటారని అన్నారు. అనంతరం కరీంనగర్ నియోజక వర్గం లో చేపట్టబోయే రోడ్డు పనులు, నిధులు వివరించారు.