– ఒబీసీ సంక్షేమ సమితి అధ్యక్షులు జి.సుధాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం తప్పదని ఒబీసీ సంక్షేమ సమితి అధ్యక్షులు జి.సుధాకర్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడు దల చేశారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పిం చాలని సుధాకర్ డిమాండ్ చేశారు. వారికి రిజర్వేషన్ కల్పి ంచకపోవడం తీవ్ర అన్యాయ మని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చట్టసభల్లో బీసీల సంఖ్య తక్కువగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మహిళ రిజర్వేషన్ల లో కూడా బీసీ మహిళలకు అవకాశం కల్పించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీసీల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టమవుతు న్నదని ఆయన విమర్శించా రు. బీసీ మహిళలను విస్మరిం చిన బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని చెప్పుకునే అర్హత కోల్పోయిందని విమర్శించారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించకపోతే ఆందోళన కార్యక్రమాలను చే పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.