రేండు రోజుల పాటు ఎల్లమ్మ పండుగ…

నవతెలంగాణ-డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం, బుధవారం రేండు రోజుల పాటు ఎల్లమ్మ పండుగ నిర్వహిస్తున్నట్లు ఉప సర్పంచ్ నవీన్ గౌడ్,గౌడ్ సంఘ సబ్యులు మంగళవారం తెలిపారు.ఈ కార్యక్రమానికి సంస్థాన్ సిర్నపల్లి గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అయిన వివరించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు శ్రీనివాస్ గౌడ్,రాజాగౌడ్, నరేందర్ గౌడ్, చిన్న శ్రీనివాస్ గౌడ్ తో పాటు మహిళలు సంఘ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.