ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు సర్ధార్ నాయక్ నియామకం

నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండలంలోని పర్మల్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్దార్ నాయక్ ను ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎన్ ఎస్ యుఐ అధ్యక్షునిగానియమించారు. ఈసందర్భంగా సర్దార్ నాయక్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను ఎల్లారెడ్డి ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులుగా నియమించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు మదన్ మెహన్ కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలుతెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ వారి తరుపున పోరాడుతనని సర్దార్ నాయక్ అన్నారు.