నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ, ట్రెజరీల్లో ఆమోదం పొంది పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటినీ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారికి ఆయన లేఖ రాశారు. ఎయిడెడ్ టీచర్లకు వేతనాలను రెగ్యులర్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పరిమితు లు లేకుండా ఆరోగ్య కార్డులను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూల్ టీచర్లను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2003 టీచర్లకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని కోరారు. 317 జీవో బాధిత టీచర్లకు న్యాయం చేయాలని విన్నవించారు. పండిట్‌లకు, పీఈటీల కు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో పారిశుధ్య సిబ్బంది కొరత వల్ల తర గతి గదు ల శుభ్రత, మధ్యాహ్న భోజననంతరం క్లీనింగ్, తదితర పనులను రెగ్యులర్‌గా చేయడం లేదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు. ఇదే అంశంపై తపస్ అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ కూడా ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.