ఎంపీడీవో కార్యలయన్ని ముట్టడించిన ఉపాధి హామీ కూలీలు

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఉపాధి కూలీలు మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందల్ వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో ఉపాధి హామీ కూలీలు తాము పనులు చేస్తున్న డబ్బులు రావడంలేదని ఆందోళన,నిరసన చేపట్టారు. ఉపాధి కూలీలకు డబ్బులు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, పని వద్దకు అదికారులు రాకపోవటంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని కులిలు వాపోయారు. గ్రామంలో పనికి రాని వారి పేర్లు నమోదు చేసుకుని బిల్లులను సైతం తీసుకోవటం జరుగుతుందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, ఉపసర్పంచ్ రాజేందర్ కలిసి పలువురిని తొలగించాలని ఎపీఓకు వినతిపత్రం అందజేశారు. ఎపిఓ పోశెట్టి మాట్లాడుతూ గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఉపాధి కూలీలకు డబ్బులు రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, పని వద్దకు సరిగ్గా రాకపోవటంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతు న్నాయని ఎపీఓ పోశెట్టితో వాపోయారు. గ్రామంలో ఫనికి రాని వారి పేర్లు నమోదు చేసుకుని బిల్లులను సైతం తీసుకోవటం జరుగుతుందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలుపటంతో కూలీలు శాంతించి నిరసనను విరమించారు.