అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలి..

– డిఅర్డిఓ, డిఅర్డిఎ పిడి చందర్ నాయక్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఉపాధి హామి పథకంలో క్షేత్ర సహాయకులు పని అడిగిన ప్రతీ ఉపాధి కూలికి పని కల్పించాలని డిఅర్డిఓ, డిఅర్డిఎ పిడి చందర్ నాయక్ సిబ్బందికి ఆదేశించారు. గురువారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్ లో ఉపాధి హామీ సిబ్బంది తో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిడి చందర్ నాయక్ పాల్గొని మాట్లాడారు.  ప్రస్తుత వర్ష కాలంలో అన్ని గ్రామాలలో ఫీడర్, ఫీల్డ్ ఛానల్స్ పూడిక తీత పనులు చేపట్టాలని, తద్వారా పంటలకు ఆటంకాలు లేకుండా నీరు అందించవచ్చని, పంట పొలాల మధ్య నుండి రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా హరిత వారంలో బాగంగా నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి దానిని సంరక్షించాలని ఆదేశించారు. గత సంవత్సరం పూర్తి చేసిన పని దినాలకు ఈ సంవత్సరం సాధించిన పని దినాలకు గాల వ్యత్యాసాన్ని గ్రామాల వారిగా సమీక నిర్వహించి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఉపాధి కూలీలకు కనీసం 250 రూపాయల వరకు రోజు వారి కూలి వచ్చెట్టుగా పని కల్పించాలని ఇందుకు సాంకేతిక సహాయం పై ఉపాధి కూలిలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఉపాధి కూలీలలో అర్హత కలిగిన యువతీ, యువకులకు ఉన్నత శిక్షణకు ఎంపిక చేయాలని ఆదేశించారు.నిజామాబాద్ జిల్లా లోని ప్రతీ మండలానికి కనీసం 50మంది అర్హత కలిగిన వారిని గుర్తించి మొత్తంగా 1350 మందికి గాను ఇప్పటికి 960 మంది గుర్తించడం జరిగిందని, మిగతా వారిని రెండు రోజులలో గుర్తించాలని అన్నారు. అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతికి అనువైన స్థలాలో ఊట కుంటల నిర్మాణం కొరకు గుర్తించాలని పిడి చందర్ నాయక్ ఉపాధి హామీ సిబ్బంది కి ఆదేశించారు.సమీక్ష సమావేశంలో అడిషనల్ డిఅర్డిఓ సంజీవ్ కుమార్, అసిస్టెంట్ పి డి అంబల ఓంపల్, ప్లాంటేషన్ మేనేజర్ కపిల్, ప్లాంటేషన్ సూపర్ వైజర్ గంగాధర్, హెడ్ మేనేజరు నర్సింలు, అడిషనల్ డిఅర్పి సుశీల్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.