– కలెక్టర్ కె.శశాంక్
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వా రా మంజూరైన ఉపాధి హామీ ప నులను వేగవంతం చేయాలని జి ల్లా కలెక్టర్ కే.శశాంక ఆదేశించా రు. గురువారం కలెక్టర్ క్యాంపు కా ర్యాలయం నుండి జిల్లా ఫారెస్ట్ అ ధికారి రవికిరణ్‌తో కలిసి ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల పర్యవేక్షణ పై టెలీ కాన్ఫరె న్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 9 మండ లాల్లో ఎన్‌ఆర్‌ఈజిఎస్ ద్వారా మంజూరైన పనులను పూర్తి చేయాలని ఎన్ని కల ప్రవర్తన నియామావాళి ఉన్నందున మండలాల్లో, గ్రామాల్లో కేవలం సాం క్షన్ అయి పెండింగ్‌లో ఉన్న పనులను మాత్రమే త్వరగా పూర్తిచేయాలని ఫా రెస్ట్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనులను వేగవంతంగా పూర్తి చే యాలని, ఇంకా ఏమైనా అత్యవసర పనులకు ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల కనుగుణంగా సాంక్షన్ చేసుకొని పనులను పూర్తి చేయుట జరుగుతుంది కావు న ప్రస్తుతం ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసుకుంటూ వారానికి ఒకసారి వాటి స్థితిని పరిశీలించుకోవాలని అధికారులకు సూచించారు. పూర్తిచేసిన ప నుల నివేదికలను రోజు వారీగా తెప్పిచుకోవాలని డిఆర్‌డిఏ పిడిని ఆదేశించా రు. డిఎఫ్‌ఓ రవికిరణ్ మాట్లాడుతూ ట్రెంచింగ్ పనులలో రెవెన్యూ అధికారు లకు అలైన్మెంట్‌కు సంబంధించిన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని పనులు త్వరగా జరిగేందుకు రెవెన్యూ అధికారులకు సహకరించి పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో డిఆర్‌డిఏ పిడి సన్యా సయ్య, డివిజనల్, రేంజ్ అటవీ అధికారులు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.