చైతన్యంతోనే మహిళ సాధికారత సాధ్యం

– వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు
తెలకపల్లి: మహిళల చైతన్యంతోనే మహిళా సాధికారత కుటుంబ గ్రామాల అభివద్ధి దేశ అభివద్ధి సాధ్యం అని వ్యవసాయ విశ్వవిద్యాలయ రా వేప్‌ విద్యార్థులు అమత ,శివ శ్రావణి, సుమాంజలి ,నాగ హర్ష ,నర్మదలు అన్నారు గురువారం మండల పరిధిలోని రాకొండ గ్రామానికి చేరుకున్న వారు స్వయం ఉపాధి మహిళ సంఘ సభ్యులకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ అంశాలపై మహిళ సాధికారత, పరిసరాల పరిశుభ్రత, చిరుధాన్యాల వల్ల కలిగే లాభాలు పంటలపై పురుగుల నివారణకు పిచికారి చేసే విధానం వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో స్వయం ఉపాధి మహిళా సంఘం అధ్యక్షురాలు అరుంధతి, స్వయం ఉపాధి మహిళా సంఘం సభ్యులు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.