భారత్‌లో అంతరిస్తున్న పక్షి జాతులు

Endangered Bird Species of India– 30 ఏండ్లలో 60 శాతం క్షీణించిన వైనం
– స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌ నివేదిక సమాచారం
న్యూఢిల్లీ: భారత్‌లో వివిధ రకాల పక్షుల మనుగడ ప్రశ్నా ర్థకమవుతున్నది. కార్పొరేట్ల ధనదాహానికి అడవు లు అంతరించుకు నిపోతున్నాయి. వీటికి తోడు అభివృద్ధి పేరుతో విధ్వంసక చర్యల కారణాలతో నూ పక్షి జాతులు అంతరించి పోతున్నాయి. భారత్‌లో గత 30 ఏండ్లలో అధ్యయనం చేసిన 338 పక్షి జాతులలో 60 శాతం క్షీణతను చవిచూశాయి. అలాగే, గత ఏడు ఏండ్లలో మార్పు కోసం మూల్యాంకనం చేయబడిన 359 జాతులలో 40 శాతం (142) క్షీణించాయి. ”స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ బర్డ్స్‌” అనే నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మూల్యాంకనం చేయబడిన మొత్తం 942 జాతులలో, 338 జాతులకు దీర్ఘకాలిక పోకడలుగా నిర్ణయించవచ్చు. వీటిలో 204 జాతులు క్షీణించాయి. 98 స్థిరంగా ఉన్నాయి. 36 పెరుగుదలను చూశాయి. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ(బీఎన్‌హెచ్‌ఎస్‌), వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ), జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) సహా 13 ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల బృందం ప్రచురించిన నివేదిక దీనిని వెల్లడించింది.