సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Equal pay for equal work:– రాష్ట్ర గిరిజన ఆశ్రమ పాఠశాల అకాడమీ ఇన్‌స్ట్రక్టర్‌ ఉపాధ్యాయులు…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమాన పనికి సమాన వేతనం కల్పించాలని రాష్ట్ర గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌స్ట్రక్టర్‌ ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ సంక్షేమభవన్‌ వద్ద వారు నిరసన తెలిపి సంబంధిత అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భ ంగా వారు మాట్లాడుతూ పదేండ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 339 మందిని గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్‌ ఉపాధ్యా యులను నియ మించారని తెలిపారు. రూ. ఐదు వేల జీతానికి చేరిన తమ కు ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేలు సరిపోవడం లేదని ఆవేద న వ్యక్తం చేశారు. థర్డ్‌ పార్టీకి అప్పగించడం సరి కాదని వాపో యారు. ఉపాధ్యాయులు రమా వత్‌ మున్యానాయ క్‌, రాథోడ్‌ రాజేందర్‌, సురేం దర్‌, అంగోత్‌ శంకర్‌ నాయక్‌, నాగేశ్వర్‌ నాయక్‌, నర్సింగ్‌, రమేష్‌, చందర్‌, కవిత, తారబారు పాల్గొన్నారు.